-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి
-సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భధ్రత చర్యలు
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రెవిన్యూ పోలీస్ ఇతర ఎన్నికలు విధులు నిర్వహించే ఎంసిసి, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, ఎం సి ఎం సి బృందాల చేపట్టి నిధులపై కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి.నర్సింహ కిషోర్ , జెసి చిన్న రాముడు, సహాయ ఎన్నికల అధికారి, డి ఆర్వో టి సీతారామ మూర్తి లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా సజావుగా నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం అయిదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 2894 మంది ఉపాధ్యాయుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1589 పురుషులు కాగా 1305 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 21 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు, 20 ఎఫ్ ఎస్ టి బృందాలు, 6 ఎస్ ఎస్ టి బృందాలను. నియమించమన్నారు. అన్ని సెక్టోరల్ రూట్ అధికారులు ముందుగానే వారికి కేటాయించిన మండలాల్లోని రూట్ లను పరిశీలించుకోవాలన్నారు. వనరులబుల్ పోలింగ్ కేంద్రాలను ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కు ముందురోజు పోలింగ్ మెటీరియల్ ఆర్ట్స్ కళాశాల లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పిఓ, పిఓలకు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అనుభవం కలిగిన వారికి ఎన్నికల విధుల్లో నియమించడం జరిగింది అని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్ , షామియానాలు, ర్యాంపులు, టాయిలెట్, టెలిఫోన్, తదితర వసతులను కల్పించామన్నారు.
జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 రూట్లలో, పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం లోను, రిసెప్షన్ సెంటర్ నందు, ప్రవేశ ద్వారము, బయటికి వెళ్లే మార్గం నందు పోలీస్ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా అంతర్ జిల్లాల సరిహద్దుల్లో ని చెక్ పోస్ట్ నందు ప్లేయింగ్ స్క్వాడ్స్ నిఘా ఉంచడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు. డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి, ఎన్నికల అధికారి ఎమ్. మాధురి, ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్, రాణి సుస్మిత, డి.ఎస్.పిలు టీవీఆర్కే కుమార్, కే.రమేష్ బాబు, డీటిఓ ఎన్.సత్యనారాయణ,జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News