మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, మొదలైన వాటిలో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30 గంటలకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓక ప్రకటనలో తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) గా జరుపుకుంటామని తెలిపారు. భారతదేశం, ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా, అన్ని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు. ఇందుకు సంబంధించి జడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలు మండల స్థాయి, గ్రామపంచాయతీ స్థాయిల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేక గ్రామసభలుగా నిర్వహించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Prajavartha Online Telugu News