తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వ రంగంగా, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా సగర్వంగా డిసెంబర్ 1వ తేదీన సంగీత కచేరీ కార్యక్రమాలను నిర్వహించనున్నారనీ, ఈ సందర్భంగా సాంస్కృతిక ఘనత కలిగిన సంగీత కచేరీలను ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో నిర్వహించనున్నారనీ, సంగీత అభిమానులకు కచేరీల నిర్వహణ ద్వారా సుస్వర వారసత్వ, భక్తి సంబంధ అనుభూతిని అందించడానికి కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుక సిద్ధమైందనీ, ఈ కార్యక్రమం తిరుపతి పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం నందు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు నిర్వహించబడుతుందని సంగీత అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాంతీయ సంచాలకులు ఏపీ టూరిజం, తిరుపతి డా.రమణ ప్రసాద్ మరియు నోడల్ అధికారి జ్యోతిర్మయి ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజి, నెల్లూరు వారు సంయుక్తంగా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …