– జిల్లాలో డిసెంబర్ 11 న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికీ చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. బుధవారం ఉదయం స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా యువ ఉత్సవ్ – గోడ ప్రతి ని కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వివిధ రంగాలలో యువతను ప్రోత్సహించడంతో పాటు వారిలో నీభిడీకృతమైన ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యం లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం నందు డిసెంబర్ 11వ తేది జిల్లా యువ ఉత్సవ్ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లా యువ ఉత్సవ్ లో ( ఇండియా @2047 ) అనే అంశం పై స్పీచ్, పెయింటింగ్ , కవిత్వం , మొబైల్ ఫొటోగ్రఫీ విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు కల్చరల్ ట్రెడిషనల్ , ఫోక్ ( గ్రూప్ ) , సైన్స్ ఎక్హిబిషన్ మేళా పోటీలలో గ్రూప్ మరియు వ్యక్తిగత పోటీలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి దూలం కిషోర్ వివరాలు తెలియ చేస్తూ, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ , ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు మరియు సర్టిఫికెట్లు ఉంటాయన్నారు. కావున జిల్లా లోని యువత ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అలాగే యువ ఉత్సవ్ లో వీరివి పాల్గొని జయప్రదం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. యువ ఉత్సవ్ లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ లింక్ నందు పేర్లు నమోదు https://forms.gle/UpuBpSKxfff3K61GA చేసుకోవాలన్నారు. ఇతర వివరాములకు ఈ 7095412584 మొబైల్ నెంబర్ సంప్రదించలన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి దూలం కిషోర్, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ, డి ఎమ్ హెచ్ వో కె. వెంకటేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News