Breaking News

తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు కాపు, గాజుల కాపు రాజకీయంగా గుర్తిస్తుంది తెలుగుదేశం, జనసేన పార్టీలు అని, తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించినందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి మరియు మంత్రి నారా లోకేష్‌కి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. గత ప్రభుత్వం తూర్పు కాపు, గాజుల కాపు సంక్షేమ విషయంలో కాలయాపన చేసిందని అన్నారు. ఇప్పుడు అది కొనసాగకుండా తూర్పు కాపు, గాజుల కాపు సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాలవలస యశస్వికు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *