క్యాపిటల్ బిజినెస్ పార్క్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ సంస్థ… : పోతిన వెంకట మహేష్ 

-ఈ సంస్థకి మంత్రి వెల్లంపల్లి కి సంబంధం లేదని దమ్ముంటే అమ్మవారి పాదాల దగ్గర ప్రమాణం చేయాలి…
-రాబోయే శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అమ్మవారి గుడి దగ్గర మంత్రి వెల్లంపల్లి కోసం ఎదురు చూస్తా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ క్యాపిటల్ బిజినెస్ పార్క్ వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ సంస్థ దీనిలో ఉండే నలుగురు డైరెక్టర్లు మంత్రికి అత్యంత సన్నిహిత స్నేహితులు , ఈ రియల్ ఎస్టేట్ సంస్థ మంగళగిరి తాడేపల్లి వద్ద 900 షాపుల అమ్మకానికి 2016 లో స్థలం సేకరించి నిర్మాణాలు చేపట్టారు, కానీ నేటికీ అందులో 100 షాపులు కూడా అమ్మకం కానందున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో కలిసి జీవో నెంబర్ 61 జారీ చేయించి తద్వారా ఈ తొమ్మిది వందల షాపుల అమ్మకం ద్వారా 350 కోట్ల రూపాయలు సేకరించి వ్యాపారం చేసుకునే లాగా ఒక భారీ స్కాం తెరలేపారని, ఈ సంస్థకు 100% స్టాంప్ డ్యూటీ 26.5 కోట్లు మినహాయింపు కొనుగోలు చేసిన లేదంటే అద్దెకి తీసుకున్న ఈ నిబంధన వర్తిస్తుందని అదేవిధంగా ఈ సంస్థ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తూ జీవో జారీ చేశారు, ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏవిధంగా ఇన్ని రాయితీలు కల్పిస్తూ మంత్రులు జీవోలు జారీ చేస్తుంటే ముఖ్యమంత్రి  ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలేశ్వరరావు మార్కెట్ వద్ద గల 5 అంతస్తులోవై. కిషోర్ ఏర్పాటు చేశారని, ఈ సంస్థ నలుగురు డైరెక్టర్లు ఎండురి. శివకృష్ణ కిషోర్, నాగ వెంకట గరే సంపత్ కుమార్, షా జయిష్ కుమార్ మోతీలాల్, గమిని.శ్రీనివాస నవీన్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితులు మంత్రి బినామీ ఈ సంస్థ కి నలుగురు డైరెక్టర్లు. ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉంటే ప్రభుత్వం రాయితీలు కల్పించిందని అనుకోవచ్చు కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రాయితీలు కల్పించడం వెనుక జరిగిన నల్ల లావాదేవీలపై ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి క్యాపిటల్ బిజినెస్ పార్క్ కు చెందిన ఈ ఏడు లక్షల చదరపు అడుగుల్లో ఈ జీవో నెంబర్ 61 జారీ చేసినందుకు సుమారు యాభై వేల అడుగుల స్థలం లబ్ధి చేకూరుతుందని సమాచారం మా దగ్గర చాలా స్పష్టంగా ఉందాన్ని. మంత్రి మేకపాటి కి ముట్టింది అంతేనా ఇంకేమన్నా ఉందా అనేది ముఖ్యమంత్రి ఎంక్వయిరీ చేయించాలని, ఇటువంటి మంత్రులను మంత్రివర్గం నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని, డిమాండ్ చేశారు. కాలేశ్వరరావు మార్కెట్ వద్ద గల వస్త్రలత క్లాత్ మార్కెట్ వ్యాపారస్తులు వద్దనుండి 16 నెలల అద్దెను ఎండురి. కిషోర్ మరియు పి. రమేష్ లు సుమారు 4.5 కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బులు ఎవరి కోసం ఎందుకోసం ఎవరి ప్రయోజనాల కోసం వినియోగించారని,సమాధానం చెప్పాలని, వస్త్రలత వ్యాపారస్థులు వద్ద నుండి జీఎస్టీ పాత అద్దెలుకు మీద కూడా కట్టాలని అవి కూడా నగదు రూపంలో చెల్లించాలని కిషోర్ మరియు రమేష్ లు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాలు , కంప్లైంట్లుగా మా వద్దకు వస్తున్నాయని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని, ఇంతవరకూ వస్త్రలతకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ఈ ఎం ఎండురి. కిషోర్ మరియు వెల్లంపల్లి మిత్రబృందం ఇక్కడ వ్యాపారస్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ వీరందరినీ తాడేపల్లి క్యాపిటల్ బిజినెస్ పార్క్లో షాపులు కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ, వ్యాపారస్తులకు అండగా నిలవాల్సిన మంత్రి వెల్లంపల్లి వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి ఇంతకన్నా మరోనిదర్శనం ఉండదని. కరోనా సమయంలో వస్త్ర వ్యాపారస్తులు అద్దెలు జీతాలు చెల్లించలేక కరెంట్ బిల్లు కట్ట లేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఖర్చీఫ్ తో కన్నీళ్లు తూడవలేదు గానీ వెల్లంపల్లి బినామీ సంస్థ అయిన క్యాపిటల్ బిజినెస్ పార్క్ మాత్రం రాయితీలు కల్పిస్తూ జీవోలు జారీ చేస్తారా? ఇదేం న్యాయం సీఎం గారు అని ప్రశ్నించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జారీ చేయించి నా జీవో నెంబర్ 61 లబ్ధిపొందిన క్యాపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు అందులోని నలుగురు పార్ట్నర్ ల తో తనకు సంబంధం లేదని బెజవాడ కనకదుర్గమ్మ పై రాబోయే శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రమాణం చేయాలని ఇది నా బహిరంగ సవాల్ అని మంత్రి స్వీకరించి శుక్రవారం దుర్గమ్మ కొండకు రావాలని నేను అన్న ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటానని మహేష్ సవాల్ చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *