Breaking News

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ని విడుదల చేయాలి

-జీవో నెంబర్ 77 రద్దు చేయాలి
-విజయవాడ లెనిన్ సెంటర్ నందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన నాయకులు
-అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం లోని లెనిన్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా AISF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జి.వలరాజు , బందెల నాసర్ జీ, మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నెలలు గడుస్తున్నా, విద్యా దీవెన, వసతి దీవెన లను, (MTF, RTF) మార్చినది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నది, అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని, ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆమెరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం, యాజమాన్యాల వద్ద 7 లక్షల విద్యార్థులు సర్టిఫికెట్లు ఉంచారు, యాజమాన్యాల దగ్గర సర్టిఫికెట్ ఉండడం ఎవరికి ప్రయోజనం, మరో పక్కన ప్రభుత్వం యాజమాన్యాల అందరికి పూర్తిగా చెల్లిస్తాం, విద్యార్థులకు , అడ్మిషన్స్ సమయాల్లో, పరీక్షల సమయంలో, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టకూడదు అనే స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల విద్యార్థుల వద్ద నుండే పేరు మోసిన కళాశాలలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటిని చూస్తూ ఉన్నారు తప్ప కార్యాచరణ సిద్ధం కావడం లేదు. ఉన్నత విద్యారంగానికి సంబంధించి జీవో నంబర్ 77 పై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు, విద్యా సంవత్సరం అమలై, విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ప్రైవేట్ కళాశాలలో, పీజీ అడ్మిషన్స్, కేవలం రియంబర్స్మెంట్ అందకపోవడం వల్ల పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి, జీవో నెంబర్ 77 , రద్దు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, ఫణింద్ర , సాయి కుమార్, సహాయ కార్యదర్శులు మస్తాన్, నాగభూషణం, షాబీర్ బాషా , రాష్ట్ర సమితి సభ్యులు సాధిక్ బాబు, కార్తీక్, బాబ్జి, యశ్వంత్, శివా, సాయి, చంద్ర నాయక్, హరికృష్ణ, అమర్నాథ్, శ్రీలత, వీరేష్, హెర్మీయా, దుర్గా ప్రసాద్, చంద్ర, ప్రణీత్, షణ్ముఖ ప్రియా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *