Breaking News

పశ్చిమ లో అందరికీ నిరంతరాయంగా మంచి నీరు కల్పించడమే లక్ష్యం

-సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం లో నివసిస్తున్న ప్రజలందరికీ నిరంతరాయంగా త్రాగునీటి సౌకర్యం కల్పించాలనేదే తమ లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యనారాయణ (సుజనా)చౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం 40వ డివిజన్లోని లారీ స్టాండ్ వద్ద 330 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన 1500 కిలో లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు తాగునీటి సరఫరాల సమస్యలను దూరం చేసేందుకే రెండవ రిజర్వాయర్ను పశ్చిమ లో నిర్మించారని, 39, 40, 42 వ డివిజన్ల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఈ రిజర్వాయర్ ద్వారా వస్తుందని, దాదాపు 20,000 ప్రజలకు త్రాగునీరు అందుతుందని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క రిజర్వాయర్ ఉండటం వలన పశ్చిమ లోని ప్రజలకు వివిధ సమయాల్లో త్రాగునీటి సరఫరా జరిగేదని కానీ ఇప్పుడు రెండవ రిజర్వాయర్ నిర్మించడం వలన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరికీ ఒకే సమయంలో త్రాగునీటి సరఫరా జరుగుతుందని అన్నారు.

భవిష్యత్తులో పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా ను కల్పించడమే తమ లక్ష్యమని అందుకు అనుగుణంగా కావాల్సిన వసతులు కల్పించాల్సిన సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీసుకురాటానికి తాను కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో కార్పొరేటర్లు ఆంజనేయ రెడ్డి, గుడివాడ నరేంద్ర, ఇర్ఫాన్, మరుపిళ్ళ రాజేష్, అర్షద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *