Breaking News

జాతీయ వాలీబాల్ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 6 వ తేదీ నుంచి పిబి సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగనున్న 68 వ స్కూల్ గేమ్స్ అండర్19 బాలికల జాతీయ వాలీ బాల్ పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.పోటీల నిర్వహణ నిమిత్తం గత రెండు రోజుల నుంచి వాలీ బాల్ కోర్టుల నిర్మాణం వేగం గా జరుగుతున్నాయి.జాతీయ పోటీల స్థాయి తగ్గట్టు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.పోటీల్లో పాల్గొనే వివిధ రాష్ట్రా ల జట్లు శుక్రవారం రాత్రి నుంచే నగరానికి చేరుకొనున్నాయి.క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.శనివారం సాయంత్రం నుంచి జట్లు సాధన చేయడానికి కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు.27 రాష్ట్రాల బాలికల జట్లు పాల్గొనే ఈ జాతీయ పోటీలు ఐదు రోజులు పాటు జరుగుతాయి.పోటీల ప్రారంభం లో వివిధ రాష్ట్రాల సంస్కతి ,సాంప్రదాయాల కనుగుణం గా సాoస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.శుక్రవారం పి బి సిద్ధార్థ కళాశాలలో పోటీల నిర్వహణ కమిటీ ల సమావేశం జరిగింది.సమావేశంలో సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వేంకటేశ్వర రావు మాట్లాడుతూ తమ కళాశాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సహకారం తో ఎంతో ప్రతిష్టాత్మకం గా పోటీలు నిర్వ హిస్తుందని సమిష్టి కృషి తో పోటీలు విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి భానుమూర్తి రాజు కమిటీలు అలసత్వం చూపకూడా విధులు నిర్వ హించి క్రీడాకారిణి లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ రవికాంత మాట్లాడుతూ పోటీల నిర్వ హణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడింపచేసే విధంగా నిర్వ హిస్తున్నమని తెలిపారు.ఈ సమావేశం లో జిల్లా వాలీ బాల్ సంఘం కార్యదర్శి డి.దయాకర్,కె వి రాధా కృష్ణ , ఎ పి రాజు లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *