Breaking News

మీ చెత్త.. మీదే బాధ్యత

-“స్వచ్ఛత సర్వేక్షన్ 2025” రిటర్న్ గిఫ్ట్ 2.0 కార్యక్రమం
-వ్యర్థాలను రోడ్డు పై పడవేసినా టీ స్టాల్ కి రిటర్న్ గిఫ్ట్
-ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారి నుండి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుం వసూలు
-మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం “స్వచ్ఛత సర్వేక్షన్ 2025” కార్యక్రమంలో భాగంగా నగరంలో శానిటేషన్ నిర్వహణ పై తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ కేతన గార్గ్ వివరాలు తెలియ చేస్తూ, మనం నివసించే ప్రాంతం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరిపై సామాజిక బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా టీ స్టాల్, హోటల్స్ , వివిధ వ్యాపారాలు నిర్వహించే వారు నుంచి వొచ్చే వ్యర్థాలను వారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ను పరిశుభ్రత కలిగిన నగరంగా “స్వచ్ఛత సర్వేక్షన్ 2025” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. నగరంలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఎవరైతే వారి ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను ఒద్దిక చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా ఈ నియమాన్ని పాటించని యెడల, “రిటర్న్ గిఫ్ట్ 2.0′” కార్యక్రమం కింద వారికే ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా వారిలో చైతన్యం కలిగించే విధంగా అడుగులు వేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గా కేతన గార్గ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సందర్భాలు ఉత్పన్నం కారాదనే లక్ష్యంగా, నగరపాలక సంస్థ ను పరిశుభ్రమైన నగరం గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు, ప్రతి ఒక్కరు తమ వంతుగా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

కోయంబత్తూరు కాఫీ షాప్ ఎదురుగా నిర్లక్ష్యంగా పడవేసిన ఖాళీ కప్పులను షాప్ లో సానిటి వర్కర్లు వెయ్యడం జరిగింది. మరో సారి ఇదీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. 19 వ డివిజన్ రైల్వే స్టేషను ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ బాబా టీ స్టాల్, మమత హోటల్, ఆల్ఫా రెస్టారెంట్, కోయంబత్తూరు  కాఫీ షాప్ పరిసరాలను పరిశీలించి, శుభ్రత పాటించాలనీ పేర్కొనడం తో పాటు ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారికి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుం వెయ్యడం జరిగింది. ఈ పర్యటన లో మునిసిపల్ అధికారులు డా వి వినూత్న, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *