పోటీ తత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్ లలో విధ్యార్థులు భాగస్వామ్యం కావాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో నిమిడికృతమైన మేధస్సుకు పదును పెడతాయని, పోటీ తత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్ లలో విధ్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపు ఇచ్చారు. శనివారం శ్రీ సత్య సాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా – జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ “87 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టరు పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి లు హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులచే రూపొందించిన ప్రాజెక్టు లని పరిశీలించి, అభినందించడం జరిగింది. ఇటువంటి ప్రదర్శనలు ఒకరోజు కాకుండ కనీసం మూడు రోజుల పాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిజిక్స్, రసాయన శాస్త్రం , గణితం , ఎర్త్/స్పేస్ సైన్స్ , ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ , ఇంజినీరింగ్ , బయో సైన్స్ / బయో కెమిస్ట్రీ , కంప్యూటర్ సైన్స్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి, వారి ఆలోచనలు తెలుసుకున్నారు.

తొలుత జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను, సైన్సు ప్రదర్శన జెండాని ఎగురు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మీ విజ్ఞానాన్ని, ఆవిష్కరణ లను దేశ, జాతీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించు కొవాలని , ఇటువంటి సైన్స్ ప్రదర్శనలలో విద్యార్థులు పాల్గొనటం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడం కు దోహదం చేస్తాయని తెలిపారు. ఇదే స్కూల్ లో చదివిన విద్యార్థిగా గర్వ పడుతున్నాను. మాతృ భాష మీద పట్టు సాధించేలా విద్యార్థులు కృషి చేయాలి. ఇంగ్లీష్ మీడియం కేవలం ఒక వారధి మాత్రమే అన్నారు. సైన్స్ ప్రదర్శన ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దాతృత్వం కలిగి ఉండాలని, వారు సంపాదించే మొత్తంలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలకు ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల మేధస్సుకు పదును పెడతాయని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారి విద్యార్థుల ప్రాజెక్ట్ ఆసక్తీ రేకెత్తించే విధంగా ఉన్నాయని తెలిపారు.

జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు మాట్లాడుతూ, ప్రతి మండలం నుంచి మూడు ప్రదర్శనలు జిల్లా స్థాయి కి ఎంపికైనట్లు తెలిపారు. మొత్తం 19 మంది బృందాలు గ్రూప్ కేటగిరి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు , వ్యక్తిగత విభాగంలో 19 మంది, ఉపాధ్యాయ కేటగిరి లో 19 మంది ప్రదర్శన ఏర్పాటు చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి 30 ప్రాజెక్ట్స్ లు ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 500 ప్రదర్శనలు 800 మంది భాగస్వామ్యం తో పోటీ పడినట్లు, వాటిలో ఉత్తమమైన వాటిని రాష్ట్ర స్థాయికి పంపానున్నట్లు తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి కె .వాసుదేవ రావు, సమగ్ర శిక్షా జిల్లా ప్రాజె క్టు కో ఆర్డినేటర్ ఎస్. సుభాషిణి, ఏ ఎమ్ వో గౌరీ శంకర రావు, సి ఎమ్ వో కె శ్రీనివాసరా వు, జిల్లా సైన్స్ అధికారి జి వి ఎన్ ఎస్ నెహ్రూ, రూరల్ ఎమ్ ఈ. వో ఎ. దుర్గా తులసిదాస్, డి సి ఈ బి సెక్రెటరీ దేవా అనిత, శ్రీ సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురయ్య తదితరు లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *