Breaking News

డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎల్ఏ తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి, చదువుకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం… ఇది మంచి ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల ప్రజా నాయకుడు: వెంకటగిరి ఎంఎల్ఏ కొరుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని, దీనిని బట్టి మన ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందని, ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా, వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని ఇది మంచి ప్రభుత్వం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎంఎల్ఏ, మున్సిపల్ చైర్ పర్సన్ భానుప్రియ, సంబంధిత అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నేడు జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గౌ. విద్యా శాఖ మంత్రి ప్రారంభం చేశారని, మన జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం అని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతోందని, అంతకంటే మిన్నగా పౌష్టికాహారం అందించాలని సంకల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి నారా లోష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు వారికి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఒక వరమని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎంతో ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో పలు కళాశాలలు పరీక్షలు రాయనివ్వని పరిస్థితుల్లో మన విద్యా శాఖ మంత్రి సదరు బకాయిలకు దశల వారీగా నిధులు విడుదల చేస్తూ ఎంతో మేలు చేశారని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ వయసులో తమ విద్యపై దృష్టి పెట్టి చదవాలని, విద్యతో పాటు క్రీడలు, వ్యాయామం అవసరమని అన్నారు. సోషల్ మీడియాను ఈ సమయంలో ఎక్కువ వాడరదని, ఒకవేళ వాడితే సోషల్ మీడియాను మంచికి, విద్య భివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు మాత్రమే కాదు పలు కోర్సులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రాకులాడరాదని, ప్రైవేట్ రంగంలో కూడా పలు అవకాశాలు ఉన్నాయని, మన జిల్లాలో శ్రీసిటీ వంటి పలు పారిశ్రామిక వాడలు ఉన్నాయని, వాటితో పాటు స్వయం ఉపాధి దిశగా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఇంటర్మీడియట్ విద్య ఐపోయాక తదుపరి డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అయ్యి ఉన్నత విద్యలు కొనసాగించాలని, బాలిక విద్యార్థినులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ అవుట్ కావద్దని కోరారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ బాల్య వివాహాలు మన జిల్లాలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బాలికలకు చిన్న వయసులో పెళ్లి చేయరాదని, బాలికలు చదువుకునేలా వారికి విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ఎవరైనా పిల్లలు చదువులో వెనుకబడిన వారుంటే వారికి ప్రత్యేకంగా గ్రూప్ చేసి వారిని చదువులో రాణించేలా చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాధికారిని ఆదేశించారు. లక్ష్యం ఉన్నతంగా ఉంచుకుని దాని సాధనకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. వెంకటగిరి ఎంఎల్ఏ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు చదువు ముద్దు అని విద్యార్థులు నినదించారు.

వెంకటగిరి ఎంఎల్ఏ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, మంచి విద్య అందించాలని మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం అమలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ బడి భోజన పథకం అమలు చేస్తూ, ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల నందు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుంటున్నాం అని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దూర దృష్టి కలిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా వారు కృషి చేస్తున్నారు అని అన్నారు. గుంతలు లేని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు పనికి వెళ్ళే సమయానికి భోజనం తయారు చేసేందుకు ఇబ్బంది ఉందని, విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశ్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు.

మునిసిపల్ చైర్మన్ భానుప్రియ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్మీడియట్ తమ జీవితంలో ముఖ్యమైన దశ అని బాగా చదువుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఎంఎల్ఏ, మునిసిపల్ చైర్మన్, సంబంధిత అధికారులతో కలిసి జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.

జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విశ్వనాథ నాయక్, జిల్లా విద్యా శాఖ అధికారి సురేష్, వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, లెక్చరర్లు, తదితర అధికారులు కళాశాల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *