-ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రబుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటిన రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు పేర్కొన్నారు.అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగర్చారు అని అన్నారు.తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో కూటమికి ఓటు వేసిన 15 శాతం పైగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు హామీలిచ్చి రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అవినాష్ అన్నారు.
వై.యన్.ఆర్.చారిటీస్ ద్వార నిరుపేద కుటుంబాలకు కుట్టు మిషన్లు అందజేత
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ మరియు వై.యన్.ఆర్. చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఆదివారం నాడు యలమంచిలి జయ ప్రకాష్ అధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2,5,7,11,17,18 డివిజన్లకు చెందిన 7 గురికి వై.యన్.ఆర్. చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిదిగా పాల్గొని లబ్దిదారులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందజేసారు.ఈ సందర్బంలో అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రు గారి సేవా స్పూర్తితో జయ ప్రకష్ వారి చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నారు అని అన్నారు.దాదాపు 15 ఏళ్ళ నుండి వారి తండ్రి గారి పేరు మిద సామజిక సేవలు చేస్తున్నారు.యలమంచిలి జయ చేసిన సేవలను జిల్ల్లాలో ఎంతో మంది కలెక్టర్లు మెచ్చుకున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో వై.యన్ చారిటిబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ అమర్నాద్,జిల్లా మున్సిపల్ విబాగ అద్యక్షులు గొట్టిపాటి హరీష్ మరయు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.