విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటే వరుణ్ గ్రూప్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. శనివారం సిటీ ఆర్మడ్ రిజర్వు పోలీస్ గ్రౌండ్ నందు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్వంలో జరిగిన సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ పాల్గొని ట్రాఫిక్‌లో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించే దిశగా ఉచితంగా 100 హెల్మెట్‌లను పంపిణీ చేశారు. పాత్రికేయులకు, తదితరులకు వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పంపిణీ చేశారు. అనంతరం వరుణ్ గ్రూప్ తరఫున ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన పి.వి.సత్యనారాయణను పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అభినందించారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో తనను తాను రక్షించుకునే నేపథ్యంలో ప్రతివారు హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రజల్లో హెల్మెట్ పై అవగాహన బాగా పెరిగిందని, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హెల్మెట్ వాడకంపై నగరంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి బాధ్యతగా హెల్మెట్లు వాడి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …