ఇండిచిప్ సెమీకండక్టర్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం…

-భారత్లో మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ ఫాబ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం చిప్ తయారీలో గ్లోబల్ లీడర్గా ఎదగడానికి మరో కీలక మైలురాయిగా, ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ తన భాగస్వామి జపాన్కు చెందిన ఎంఎస్ యితో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ (YMTL)తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ₹14,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం స్థాపించడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ అత్యాధునిక ఫెసిలిటీ సిలికాన్ కార్బైడ్ (SiC) చిప్స్ తయారీలో దృష్టి సారించడంతో భారతదేశం సాంకేతికత అభివృద్ధి మరియు స్థిరత లక్ష్యాలకు కీలకంగా తోడ్పడనుంది.

నవంబర్ 2024లో ప్రకటించిన సెమీకండక్టర్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీలో హట్గా మారుస్తోంది. ఈ కొత్త SiC ఫ్యాబ్ సౌకర్యం ప్రారంభంలో నెలకు 10,000 వాఫర్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. తదుపరి 2-3 సంవత్సరాల్లో 50,000 వాఫర్స్ ఉత్పత్తికి చేరుకోనుంది. ఈ పెట్టుబడి ఆత్మ నిర్బర్ భారత్ దృష్టితో అనుసంధానమై, విద్యుత్ వాహనాలు, నూతన ఇంధన పరికరాలు, మరియు పునరుత్పత్తి శక్తి పరిష్కారాల యొక్క పెరుగుతున్న గ్లోబల్ డిమాండ్ను తీర్చేందుకు దోహదం చేస్తుంది.

ఈ అవగాహన ఒప్పందం ఇండిచిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ బిచ్చోరియా మరియు ఏపీ ఈడీబీ (APEDB) సీఈఓ  సాయికాంత్ వర్మ మధ్య సంతకమైంది. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి  టీ.జి. భారత్, ఇండిచిప్ డైరెక్టర్లు డా. సందీప్ గార్గ్, వెబ్ చాంగ్, బిజినెస్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ రవి ఏవి, జేవీ భాగస్వామి ప్రతినిధులు డేవిడ్ యార్క్ యువాన్ చాంగ్ (చైర్మన్, యితో మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, జపాన్), మోటోసుగి కీసుకె (సీఈఓ, YMTC) మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.

ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఈ పెట్టుబడి ఆంధ్ర ప్రదేశ్ వినూత్న పాలసీలు మరియు బలమైన మౌలిక సదుపాయాల ద్వారా ఆధునిక పరిశ్రమలను ఆకర్షించే సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తోంది. టాలెంట్ను పెంపొందించడానికి మరియు మెరుగైన మద్దతు అందించడానికి మేం తీసుకుంటున్న చర్యలు ఈ ప్రాజెక్ట్ విజయానికి తోడ్పడతాయి మరియు భారతదేశం యొక్క గ్లోబల్ సెమీకండక్టర్ అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయి” అన్నారు.

పరిశ్రమల మంత్రి టి.జి. భారత్ అన్నారు. “ఈ భాగస్వామ్యం ఆంధ్ర ప్రదేశ్ను తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం లక్ష్యంగా ఉంది. ఈ SiC ఫ్యాబ్ స్థాపన వేలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, నూతన ఆవిష్కరణలకు మరియు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుంది” అన్నారు.

ఈ సందర్భంగా ఇండిచిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ బిచ్ఛోరియా మాట్లాడుతూ, “సాంకేతిక ఆవిష్కరణల ద్వారా జాతీయ నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నామనే సంకేతం ఈ ప్రాజెక్ట్. సిలికాన్ కార్బైడ్ చిప్స్ పై దృష్టి సారించడం ద్వారా, భారతదేశం యొక్క తయారీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమకు మేం తోడ్పడతాము” అన్నారు.

డా. సందీప్ గార్గ్, డైరెక్టర్, ఇండిచిప్, మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడమే కాకుండా, విద్యుత్ వాహనాలు మరియు పునరుత్పత్తి శక్తి రంగాలలో పెరుగుతున్న అవసరాలకు ఉద్దేశించి స్థిరమైన భవిష్యత్కు మార్గం వేస్తుంది” అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా ఒర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో అవసరమైన భూమిని, అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు ఎకోసిస్టమ్ను అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ అభివృద్ధితో, ఆంధ్ర ప్రదేశ్ సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రాధాన్య హట్గా ఎదిగి, భారతదేశం యొక్క సాంకేతిక పురోగతికి ఆదర్శంగా నిలుస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *