విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురంలో ఉన్న ‘‘శారద విద్యా సంస్థల’’ స్పోర్ట్స్ డే సందర్భముగా వి.పి.ఎస్. సిద్ధార్థ పాఠశాల ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, రన్నింగ్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద విద్యాసంస్థల చైర్మన్ వై.రమేష్‌బాబు మాట్లాడుతూ ఆట పాటలకు వయసుతో సంబంధంలేదని, మానసిక ప్రశాంతతకు శారీరక శ్రమ అవసరం వుంటుందని, అప్పుడే మంచి ఆరోగ్యాన్ని పొందుతామని, మానసిక, శారీరక ఉత్తేజాన్ని కలిగించే ఉద్దేశ్యంతో తమ కళాశాల విద్యార్థులతో పాటు, కళాశాల యాజమాన్యం అధ్యాపకులకు కూడా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
కళాశాల ఎం.డి వై.శారద దేవి మాట్లాడుతూ ఈ సంవత్సరం స్పోర్ట్స్ మీట్ విద్యార్థులతో పాటు, అధ్యాపకులు కూడా ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొనడం, గెలుపు ఓటమిలను పొందడం వలన వారి భవిష్యత్తు ప్రణాళికలకు నిచ్చెనలు వేసే ఆలోచనా సామర్థం పెరుగుతుందని, విద్యార్థులకు మానసిక ఆనందాన్ని శారీరక బలాన్ని అంచనా వేసే శక్తిని, స్ఫూర్తిని ఇస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆటలపోటీలలో పాల్గొని ఉత్తమ స్థానంలో ఉంటూ పలురకాల పతకాలను సాధించడం తమకు ఎంతో గర్వంగా వుంటుందన్నారు.
కళాశాల అడ్వైజర్ ఈ.యస్.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూఅధ్యాపకుల స్ఫూర్తితో విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతం చేశారన్నారు. కళాశాల జి.యమ్ జి.వి.రావు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం నాలుగు గోడల మధ్య చదువుకే పరిమితం అవుతూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, అటువంటి విద్యార్థులకు శారీరక వ్యాయామం కలిగిన ఇలాంటి ఆటలపోటీలు నిర్వహించడం వలన వారి మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చన్నారు. ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకబృందం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు తాము కూడా ఎంతో ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గోని బహుమతులు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …