విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణను గురునానక్ కాలనీలోని ప్రధాన అఖిల భారత మాల సంఘాల జేఏసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. శనివారం షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవులు అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఐఆర్‌ఎస్, రిటైర్డ్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు డైరీను ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఆర్.సుబ్బారావు, జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, పరస సురేష్, పి.డానియల్ మరియు తదితర న్యాయవాదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News