Breaking News

కాశీ విశ్వేశ్వరుని సేవలో మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని శనివారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముక్కంటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసనాథునికి సుగంధ‌ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయని మల్లాది విష్ణు తెలిపారు. ఆ శివయ్య చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *