-ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20 తేదీ నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే రెండవ సారి లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ (LCDC)లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం సంచాలకులు డాక్టార్ కే పద్మావతి తెలిపారు. ఈ కార్యాక్రమంలో అర్బన్ ఏరియా , గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆశా మరియు ఎఎన్ ఎం పరీక్షించి అనుమానిత కేసులను దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారికి పరిక్ష నిమిత్తం రెఫెర్ చేయాలన్నారు.
శరీరం పై స్పర్శ లేని రంగు మారిన మచ్చలు , కళ్ళు, కాళ్ళు చేతులు అంగ వైకల్యం ఉన్నచో ఆశా మరియు ఎఎన్ ఎం దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెఫెర్ చేసి వైద్య అధికారి నిర్దారణ తరువాత MDT మందులు ఉచితంగా ఇస్తారని తెలిపారు. మొదటి మచ్చ రూపంలో ముందుగా గుర్తించగలిగితే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవడమే కాకుండా , అంగవైకల్యం రాకుండా అరికట్టవచ్చే విషయాన్ని కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి చేరేలా, అలాగే ప్రధాన కూడళ్ల వద్ద బ్యానర్లను ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె కోరారు.