స్వఛ్చత కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి మూడో శనివారం స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివాస్ లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రవేటు సంస్థలలో స్వఛ్చత కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివాస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయితీ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల మూడో శనివారం స్వఛ్చ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రతి నెల ఒక థీమ్ తో 12 నెలలు స్వఛ్చత కార్యక్రమాలను కాంపెయిన్ మోడ్ లో నిర్వహించేలా మార్గదర్శకాలను జారీ చేశారన్నారు. మొదటి నెల జనవరి 18వ తేది శనివారం న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ దీమ్ తో స్వఛ్చత కార్యక్రమాలు జిల్లాలోని ప్రతి మున్సిపాల్టీలో, గ్రామ స్థాయిలోను నిర్వహించాలన్నారు. పురపాలక, పంచాయితీ శాఖలతో పబ్లిక్, ప్రైవేటు సంస్థలలోను స్వఛ్చత కార్యక్రమాలు నిర్వహణకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యర్ధాల శుభ్రం చేయటం, కాల్వలు పూడికతీయుట, త్రాగునీరు ట్యాంకులు క్లీనింగ్, క్లోరినేషన్, వ్యర్ధాల నిర్వహణకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు పనులు కల్పన తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ స్వఛ్చత కార్యక్రమాలను వ్యక్తిగతంగా నిరంతరం నిర్వహించేలా వినుత్నమైన విధానాలతో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కార్యక్రమ నిర్వహణ పర్యవేక్షణకు శాఖల వారీగా నోడల్ అధికారులు నియమించాలన్నారు. శనివారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాల్టీలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలతో స్వఛ్చత ఆంధ్రా – స్వఛ్చత దివాస్ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *