Breaking News

నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20-01-2025 వ తేదీన నల్లపాడు MBTS ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నందు జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనుక పరిసర ప్రాంత యువతి యువకులు ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు.
ఈ ఫెయిర్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ‌టిఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-35 సం||ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *