విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి సీనియర్ నాయకులు రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ని శుక్రవారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నేతలు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని సుజనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీయే కూటమి నేతలు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, పోతిన భేసు కంటేశ్వరుడు, దాడి అప్పారావు, దుర్భేసుల హుస్సేన్, బోగవల్లి శ్రీధర్, పైలా సురేష్, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …