-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినెల మూడవ శనివారాన్ని స్వర్ణ ఆంధ్ర • స్వచ్ఛ ఆంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 3వ డివిజన్ మాచవరం(జోశ్యుల వారి తోట)లో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బిసి కళాశాల బాలుర వసతి గృహం వద్ద చీపురు పట్టి పరిశుభ్రం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడిన వారితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర, పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్ఛత వైపు ఒక ముందడుగు గేద్దామన్నారు. ప్రతి పౌరుడు మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు.
గత అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నం పర్యటనలో స్థానిక డంపింగ్ యార్డ్ ను సందర్శించి, దీనిని సుందర పార్క్ గా తీర్చిదిద్దేందుకు 13 కోట్ల రూపాయలు అందించారన్నారు. ప్రతిరోజు సేకరించే చెత్త రోజుకు సుమారు 90 మెట్రిట్ టన్నుల చెత్తను సెగ్రిగేట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేస్తున్నదని అన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరు 3వ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ కూటమి నాయకులు బండి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మనందరం బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుదామని ప్రతి నియోజకవర్గం, ప్రతి ఇంటిలో కూడా పాటించాలని, మన తరం, రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిద్దాం అన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన మంత్రి
అనంతరం మంత్రి కూటమి నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జడ్పీ ఆవరణలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కార్పొరేటర్లు, వివిధ వార్డుల ఇన్చార్జులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.