-స్వచ్చ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకుకు సహకరించండి.
-కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త :
మన ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, కార్పొరేటర్లు ఆర్.సి మునికృష్ణ, అన్నా అనితా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 2025 లోపు ఇంటింటి చెత్త సేకరణ 100 శాతం నిర్వహించేలా చేయడం, అక్టోబర్ 2025 లోపు చెత్తకుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరికి వారు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తద్వారా మన నగరంతో పాటు రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా మారుతుందని అన్నారు.
కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ.. స్వచ్చాంద్ర – స్వచ్ దివస్ కార్యక్రమం లో భాగంగా ప్రకాశం పార్కుల్లో చెత్త తొలగించి , మానవాహారం ఏర్పాటు చేశామని అన్నారు. శెట్టిపల్లి వద్ద పెద్ద చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా తమ సిబ్బందికి ఇవ్వాలని, కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛాంద్ర ప్రదేశ్ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని అందరూ సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డి.ఈ.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News