Breaking News

విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సులు…

-జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో చేయించడం జరిగింది

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా యందలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫ్లెమింగో పక్షుల గురించి పులికాట్ సరస్సు నందు పక్షుల యొక్క ఆగమనం మొదలగు విషయాలపై తెలియజేయు నిమిత్తం పూర్తిగా ఉచితంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాల వారు ఏర్పాటు చేయబడిన బస్సుల ద్వారా 2600 మంది విద్యార్థులు సందర్శించడం జరిగింది. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక ఎస్కార్ట్ టీచర్ను నియమించి జాగ్రత్తగా తీసుకెళ్లి విద్యార్థులను వారి గమ్య స్థానాల్లో చేర్చడం జరిగింది. ఈరోజు సందర్శించిన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ శ్రీయుత కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ వారి ద్వారా ఉచితంగా BC వెల్ఫేర్ హాస్టల్స్ ఏ కుళ్ళు, దొరవారి సత్రం మండలం నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఇదేవిధంగా రాబోయే రెండు రోజులు మూడువేల మంది విద్యార్థులకు సూళ్లూరుపేట నేలపట్టు పక్షుల కేంద్రం మరియు దివి పాలెం సందర్శించు నిమిత్తం చర్యలు బడినదని తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *