Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 12 ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 12 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగం లో 5 అందుకున్నారు, ప్రజారోగ్యం 1, ఇంజనీరింగ్ 5, రెవిన్యూ విభాగం లో 1, ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు.

ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సుపరింటంగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్య కుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డీఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.ఎస్.ఎస్ సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *