Breaking News

ముమ్మరంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నందు జరుగుతున్న బీఫామ్ పట్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరం గా జరుగుతోందని ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. పాయికాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట లో 10 సంవత్సరాలు నిండిన ఇంటి యజమానులకు బి ఫాం పట్టాను పక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుందని, ఇంకాను రిజిస్ట్రేషన్ జరగవలసినవి 1171 ఉండగా, అందులో 371 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. ఇంకాను ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చెయ్యాలో త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *