Breaking News

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయo తో పట్టేష్ట్గంగా ఏర్పాట్లు చేయాలి.

-సామాన్య భక్తులకు అందుబాటు లోకి ఆన్లైన్ ద్వారా దర్శనం టోకెన్లు జారీ
-బాల్య వివాహాలు జరగకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమనవ్య చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
-బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా, పట్టిష్ట ఏర్పాట్లు బందో బస్తూ తో నిర్వహిస్తున్నాo : శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
-బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలి ఆలయ ఈ ఓ బాపిరెడ్డి

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. మంచి అనుభూతితో దర్శన కల్పించేలా, పటిష్ఠ బందోబస్తుతో ఏర్పాట్లును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం స్థానిక శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలోని ఈ ఓ
పరిపాలన భవనంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు – 2025 నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆలయ దేవస్థానం ఈ ఓ బాపిరెడ్డి,అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహరాచారి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి ఆరవ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ఎలాంటి అవాంఛనీర్ సంఘటనలు జరగకుండా సమన్వయంతో నిర్వహించాలి అని తెలిపారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి ఎటువంటి మంచి అనుభూతితో దర్శనం కల్పిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. సులభంగా దర్శనం చేయించుటకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ టిక్కెట్లు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా సిసి కెమెరాలు డ్రోన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు సౌకర్యార్థం ఆదనంగా ఉచిత బస్సులు తిరుపతి, వెంకటగిరి నాయుడుపేట, తదితర ప్రదేశాల నుంచి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మాడవీధులలో తొమ్మిది చోట్ల హారతి సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలు నిర్మూలన దిశగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, బాల్య వివాహాలకు ఎవరైనా పాల్పడితే వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. మునిసిపల్ శాఖ సమన్వయంతో పూర్తిస్థాయిలో ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు , దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని అన్నారు. పోలీస్ శాఖ ఎలాంటి చిన్నపాటి సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు, భక్తులకు భద్రత , పార్కింగ్, వాహనాల మళ్లింపు వంటివి చూడాలని అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వలన భక్తులకు దర్శనం, ఏర్పాట్లు వంటి సమాచారం పూర్తిగా తెలుస్తుంది. పర్యాటక ప్రదేశాలు మరియు బస్టాండ్ లో త్రాగు నీరువసతి మరుగుదొడ్లు ఉండేలా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అధిక సంఖ్యలో దర్శనం కోసం భక్తులు రావడం జరుగుతుందని ఆలయ ప్రాంతాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించే దిశగా కలంకారి, వంటి ఏర్పాటు ఉండాలన్నారు. రెవెన్యూ యంత్రాంగం ప్రోటోకాల్ , పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి ప్రతి ఒక్కరు చేయాలి అన్నారు. మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ప్రత్యేక బందోబస్తు, భద్రత కట్టుదిట్టం. చేయాలని తెలిపారు. మెడికల్ క్యాంపు లు, 108 అందుబాటులో వుండాలని అన్నారు. వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉండేలా చూడాలి. బ్రహ్మోత్సవాలు సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.

ఎంఎల్ఏ మాట్లాడుతూ.. మహాశివరాత్రి దృష్ట్యా బ్రహ్మోత్సవాలు సమయంలో చిన్న అవాంతరాలు సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. విఐపి దర్శనాల కంటే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీసీ కెమెరాలు, డ్రోన్ మానిటరింగ్ ఉంటుంది అని తెలిపారు. బ్రహ్మోత్సవాల మొదలు ముగింపు వరకు 24 గంటలు త్రాగు నీరువసతి ఏర్పాటు, అత్యవసర వైద్య సిబ్బంది, మెడికల్ క్యాంపులు , వీల్ చైర్స్, స్ట్రెచ్ అందుబాటులో ఉంటాయన్నారు. మీడియా మిత్రులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఉంటుందని, వీఐపీ దర్శనం కోసం వచ్చిన వారు వారే మీ దగ్గరకి వచ్చి ఫొటోస్ తీసికొనేల ప్రణాళికలు రూపొందిస్తున్నాము అన్నారు. వీఐపీ దర్శనం కోసం ప్రత్యెక స్లాట్స్ ఉంటాయని చెప్పారు. మహా శివరాత్రి ఉత్సవాలు బారత్, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఈ సారి ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు బార్ కోడింగ్ స్కాన్ ద్వారా ఉంటుందనీ అన్నారు. అందుకోసం వివిధ కౌంటర్ లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలు ఈవో సమన్వయంతోబ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించేలా ఉంటాయని తెలిపారు.

ఆలయ ఈ ఓ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6 వ తేదీ వరకు వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ దర్శనం కల్పించేలా క్యూలైన్ లు ఉంటాయన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు మరియు పార్కింగ్ ప్రదేశాలలో లైటింగ్, మరుగుదొడ్లు, సూచిక బోర్డులు పటిష్టంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, మనోహర చారి, వెంకటరావు రావు, ఆర్ డి ఓ భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *