గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక త్రవ్వకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పదిహేను రోజుల్లోపు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు పూర్తి చేసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ అమోదానికి ప్రతిపాదనలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సత్వరమే ఇసుకను అందించేందుకు నిబంధనల ప్రకారం ఇసుక త్రవ్వకాల అనుమతుల మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 17 ఎకరాల పట్టభూముల్లో, 4.93 హెక్టార్ల ప్రభుత్వ భూముల్లో ఇసుక త్రవ్వకాలకు చేసుకున్న దరఖాస్తులను కమిటీలో అమోదించారు. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే త్రవ్వకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 70 ఎకరాల్లో ఇసుక త్రవ్వకాల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పరిష్కరించాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి వెంకటసాయి, జిల్లా ఉప రవాణా కమిషనర్ కె సీతారామి రెడ్డి , జిల్లా భూగర్భజలవనరుల శాఖ డీడీ వందనం, జిల్లా పంచాయితీ అధికారి బీఎన్ఎన్ సాయికుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీమా బేగం తహశీల్దార్లు సిద్ధార్ద, డి సీతారామయ్య, ఆర్ డబ్ల్యు ఎస్, రిజర్వ్ కన్జర్వేటీవ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …