గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా “బేటి బచావో – బేటి పడావో పధకము” ప్రారంభించబడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, గుంటూరు వారి ఆదేశాల ప్రకారం జిల్లా మహిళ & శిశు అభివృద్ధి సంస్థ, గుంటూరు వారి ఆధ్వర్యంలో తేదీ 22-01-2025 న వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచంద సంస్థలతో జిల్లా స్థాయి కార్యక్రమమును S.R. శంకరన్, IAS సమావేశ మందిరము, గుంటూరు నందు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమమునకు K.V.A.S. విజయ లక్ష్మి, జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి వారు అధ్యక్ష్యత వహించడమైనది. ఈ కార్యక్రమమునకు K.V. జయ లక్ష్మి, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి, C.V. రేణుక, జిల్లా విద్యాధికారి, T.V. విజయ లక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఏ., వారు విచ్చేయడమైనది. కార్యక్రమమునకు హాజరైన వారందరికీ“బేటి బచావో – బేటి పడావో పధకము” యొక్క ముక్య ఉద్దేశ్యము, పధకం అమలులో వివిధ విభాగాల మధ్య సమన్వయం, బాధ్యత మొదలగు అంశాలపై Ch. విజయ్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణాధికారి, జిల్లా బాలల పరిరక్షణా విభాగము, గుంటూరు వారు సవివరముగా పవర్ పాయింట్ ద్వారా వివరించడమైనది. T. శ్రీవాణి, నోడల్ ఆఫీసర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, వారు మాట్లాడుతూ “బేటి బచావో – బేటి పడావో పధకము” అమలుపరుస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై సభికులకు అవగాహాన కల్పించారు. K.V. జయ లక్ష్మి, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి వారు PCPNDT చట్టము అమలు, బాల్య వివాహాములు వలన కలుగు నష్టాల గురించి సవివరముగా తెలియజేయడమైనది. C.V. రేణుక, జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ లింగ నిష్పత్తి పెంపు, 8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు బాలికలు స్కూల్ డ్రాప్ ఔట్ జరగకుండా చూసుకోవాలని, లింగ వివక్షత తగ్గించి బాల్య వివాహాములు నిరోధించాలని పిలుపునిచ్చారు. శ్రీమతి K.V.A.S. విజయ లక్ష్మి, జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై వివరిస్తూ సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బంది అందరూ గ్రామాలలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణా కమిటీలతో కలిసి పని చేయాలని, బాల బాలికలకు టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి అవగాహాన కల్పించాలని కోరడమైనది. పిల్లలకు శారీరక, మానసిక పరిపక్వత పై అవగాహానా కార్యక్రమాలు నిర్వహించాలని కోరడమైనది. ఈ కార్యక్రమమునకు జిల్లాలోని సి.డి.పి.ఓ.,లు , సూపర్వైజర్లు, అంగన్వాడి కార్యకర్తలు, క్రీడా విభాగము నుండి శిక్షకులు,బాల సదనము మరియు కళాశాల వసతి గృహము విద్యార్ధినులు ఈ కార్యక్రమమునకు హాజరు అవ్వడమైనది. ఈ కార్యక్రమములో వెబ్ కాస్ట్ ద్వారా DPOలు, CDPOలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు మరియు OSCలు, DHEWలు, శక్తి సదన్, సఖి నివాస్, CCIలు, CWCలు మరియు JJBలు మొదలైన అధికారులు/అధికారులు సహా రాష్ట్ర, జిల్లా మరియు బ్లాక్ స్థాయిలలోని అధికారులందరికీ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం యొక్క 10 సంవత్సరాల ముఖ్యమైన మైలురాయిని పురస్కరించుకుని, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 22 జనవరి 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన వేడుకను వీక్షింప చేయడమైనది.బేటి బచావో – బేటి పడావో పధకము ద్వారా బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాము అను నినాదము పై ప్రతిజ్ఞ సభికులచే చేయించడమైనది. “బేటి బచావో – బేటి పడావో పధకము” ప్రారంభిచబడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నిర్వహించిన కార్యక్రమమునకు హాజరు అయిన సభికులు అందరి చేత సంతకాల సేకరణ కార్యక్రమము నిర్వహించడమైనది.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …