-హ్యూండాయ్ షో రూమ్ లో క్రెటా ఈవీ కార్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజధాని ప్రాంతంలోని విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ది చెందుతుంది. నగరానికి ప్రజల సౌకర్యార్థం కొత్త వాహనాలు అందుబాటులోకి రావటం ఎంతో సంతోషంగా వుందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎనికేపాడు లోని లక్కీ హ్యూండాయ్ షో రూమ్ లో బుధవారం ఎంపి కేశినేని శివనాథ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎమ్.డి.అహ్మాద్ షరీష్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తో కలిసి హ్యూండాయ్ క్రేటా ఎలక్ట్రిక్ కార్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఈవీ వాహనాల వైపు చూస్తుందని… ఈవీ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గుతుందన్నారు. అలాగే వినియోగదారులకు నిర్వహణ భారం కూడా తగ్గుతుందన్నారు. విజయవాడ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ తో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హ్యుండాయ్ షో రూమ్ చైర్మన్ సందీప్ ఉస్మాన్, సి.జి.ఎమ్. రోహిణ్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.