గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 23న (గురువారం) సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో కార్మికులు ప్రధానంగా పిఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై ఎదురవుతున్న సమస్యలపై అర్జీలను గ్రీవెన్స్ లో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …