Breaking News

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం నందు ఈ నెల 26 న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో జిల్లా కలెక్టర్ వర్చువల్ గా హాజరై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు హాజరావగా సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి శ్రీమతి మౌర్య పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచిస్తూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26 న పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆర్డిఓ పర్యవేక్షించాలన్నారు, గ్రౌండ్ నందు పోలీస్ వారు బందోబస్తు, జెండా వందనం, ఓపెన్ టాప్ జీపు ఏర్పాటు, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, శానిటేషన్, లైటింగ్ తదితర ఏర్పాట్లు మునిసిపల్ కార్పొరేషన్, తుడా వారు చేపట్టాలని, సీటింగ్, ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్విటేషన్ ఏర్పాట్లను అర్బన్ తహశీల్దార్, మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, వివిధ శాఖల నుండి ప్రగతి నివేదికల మేరకు స్పీచ్ నోట్స్ తయారీ డి ఐ పి ఆర్ ఓ చూడాలని, యాంకర్ ఏర్పాటు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఈఓ ఐ అండ్ పిఆర్ సమన్వయంతో చేయాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డి ఎం అండ్ హెచ్ ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు వసతి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, నిరంతర విద్యుత్ ఎపి ఎస్ పి డి సి ఎల్ వారు చేపట్టాలని, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు విధులు కేటాయించబడిన అధికారులు సక్రమంగా చేయాలన్నారు,

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పై స్టాల్స్ 11 మరియు 12 శకటాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *