విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త తిరుమల గుడిమెళ్ళ రాజ్యలక్ష్మికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పిహెచ్.డి.పట్టా ప్రకటించింది. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణంరాజు పర్యవేక్షణలో ప్రణవసదృశం విష్ణుచిత్తుని తిరుప్పల్లాండు విష్ణుప్రబంధం అంశంపై శ్రీమతి రాజ్యలక్ష్మి సమర్పించిన సిద్ధాంతవ్యాసానికి వర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు డాక్టర్ జె. అప్పారావు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. ఏడుపదుల వయసులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న రాజ్యలక్ష్మి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్. శివకుమార్, ఆంధ్రోపన్యాసకులు అభినందనలు తెలిపారు. ఇటీవల భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆహ్వానంపై ధనుర్మాసం సందర్భంగా రాజ్యలక్ష్మి నెలరోజులపాటు తిరుప్పావై ప్రవచనాలు అందించారు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …