విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆరోగ్య పరిరక్షణలో ఒక నూతన బెంచ్‌మార్క్ సాధనకు అద్భుతమైన ఆరోగ్య బీమా అల్టిమేట్ కేర్‌ను ఆవిష్కరించినట్లు నేడు ప్రకటించారు. మన అనుకోని వైద్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించుటకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్‌లను అందించుటకు అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉన్న పాలసీ అల్టిమేట్ కేర్ ఆరోగ్య బీమా పథకం. పాలసీదారు కోసం ఎన్నో విలువైన అంశాలను జోడించిన ఆరోగ్య పథకం. పాలసీదారులు ఈ బీమా పథకం ద్వారా మనీబ్యాక్, లాయల్టీ బూస్ట్, వెల్నెస్ డిస్కౌంట్, ఇన్ఫినిటీ బోనస్ ఇంకా అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు.
విస్తృతమైన ఆరోగ్య కవరేజీని అందించటమే కాక , మనీబ్యాక్ ఫీచర్ కలిగిన పాలసీ అల్టిమేట్ కేర్ ఇది పాలసీదారులు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్ అందిస్తుంది. ప్రతి 5 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత కంపెనీ మొదటి సంవత్సరపు బేస్ ప్రీమియంను వాపసు చేస్తుంది. ఇది లాయల్టీ బూస్ట్ 7 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత మొదటి పాలసీ సంవత్సరపు బీమా చేసిన (SI) మొత్తానికి సమానమైన అదనపు బీమా మొత్తాన్ని (SI) అందిస్తుంది. క్లెయిమ్‌లతో ఎలాటి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం SI యొక్క 100% బోనస్ లభిస్తుంది. అంతేకాక ఆరోగ్యకరమైన రోజులు కార్యక్రమంతో రెన్యూవల్ ప్రీమియంపై 30% వరకు వెల్‌నెస్ డిస్కౌంట్‌ని అందిస్తుంది.
ఈ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ – డిస్ట్రిబ్యూషన్ అజయ్ షా మాట్లాడుతూ, “ ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖాతాదారులకు సమగ్రమైన మరియు పటిష్టమైన ఆర్థిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ రకమైన ఆర్ధిక భద్రత మనం ఊహించని వ్యాధుల వైద్య అవసరాల సమయంలో ఆదుకుంటుంది అన్నారు. ఖాతాదారులకు మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి అవసరమైన ఆర్ధిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో అల్టిమేట్ కేర్ ఆవిష్కరించినట్లు చెప్పారు.
ఈ పాలసీ తన పాలసీదారులకు గరిష్ట విలువను అందించటమే కాక అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొత్తగా పాలసీ తీసుకునే వారికి ప్రారంభ ఆఫర్ గా ప్రీమియంపై 30% వరకు తగ్గింపు అవకాశం కల్పిస్తున్నారు. మెడివోచర్లు అనేక సంవత్సరాల పాలసీ వ్యవధిలో ఒకే క్లెయిమ్ ఉంటే పాలసీ యొక్క మొదటి పాలసీ రిన్యువల్ తర్వాత ఒక్కొక్కటి రూ. 250 విలువైన రెండు ఫార్మసీ వోచర్‌లు లభిస్తాయి.