విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం జనవరి 20 నుండి 21 వరకు “కంప్యూటర్-ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ మరియు స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్” అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. మొదటి రోజు ఆటోడాకింగ్ , ప్రొటీన్-లిగాండ్ ఇంటరాక్షన్స్ మరియు కెమి ఇన్ఫర్మాటిక్స్ పై అమెరికా లో జార్జి మేసన్ విశ్వవిద్యాలయం లో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్న మేడూరి రామకృష్ణ విద్యార్థులకు అవగాహన కల్పించారు . 2వ రోజు, Mr. పునీత్ పరిశ్రమ నిపుణులు (కియాజెన్ సంస్ధ) మరియు Mr. V. మనీష్ రెడ్డి, వల్లూరి వీర్రాస్వామి(టోశ్విన్ సంస్ధ) జీవిత శాస్త్రాలలో స్పెక్ట్రోస్కోపిక్ విశ్లేషణ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, జీవరసాయన పరిశోధన మరియు ఔషధాల అభివృద్ధిలో దాని అనువర్తనాలను హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్.సిస్టర్. లీనా క్వాడ్రాస్, ప్రిన్సిపాల్ డాక్టర్. సిస్టర్. జస్సింతా క్వాడ్రాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్.సిస్టర్.ఇనాస్యమ్మ,డాక్టర్.సిస్టర్. కులరేఖ ముదర్త, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి జి. ఉషా కుమారి, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి కె. కృష్ణ మనోహర్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.గంగరాజు, వి.శ్రీ వెంకట వైష్ణవి, డాక్టర్.ఎం.సంధ్యారాణి, సయ్యద్ సూఫియా సుల్తానా, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …