-ఆర్ట్స్ కళాశాల లో పేరెడ్ రిహార్సిల్స్ పర్యవేక్షణా
-వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ గా స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శన
-జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని ఏర్పాట్లు చెయ్యడం జరుగుతోందను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కలక్టర్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌ను అధికారులతో కలిసి పరిశీలించినట్టు చెప్పారు. జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వేడుకలకు వచ్చే అతిథులు సభావేదిక, తదితర ఏర్పాట్లను పరిశీలించామన్నారు. స్టేజ్ ఏర్పాటు బారికేడింగ్, వేడుకలు తిలకించేందుకు వచ్చే విధ్యార్థులకు గ్యాలరీల ఏర్పాటుపై చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు వేడుకలు నిర్వహించే క్రమంలో, ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ది కార్యక్రమాల సమాహారంగా శాఖలు శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, స్టేజి నిర్మాణం పై అధికారులకి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేసారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కతిక కార్యాక్రమాల కోసం వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు జాతీయ స్పూర్తిని నింపే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మురళీ కృష్ణ, ఇతర జిల్లా అధికారులు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు