-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు
రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఒక్కరు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వస్తువు కొనుగోలు చేసే సమయంలోనే నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. బిల్లు తప్పకుండా తీసుకోవాలన్నారు. మోసపోతే కన్జ్యూమర్ కమిషన్లో కేసు నమోదు చేసి సత్వర న్యాయం పొందవచన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిఎల్ఎస్ఏ మరియు డిసిపిసి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం-2019 లో ఈ కామర్స్, మీడియేషన్, వీడియో కాన్ఫరెన్సింగ్ తదితర అంశాలు ఇందులో క్రోడీకరించడం జరిగిందని తెలిపారు. ఎంపిడిఓ జె.ఏ. ఝాన్సీ, తహసీల్దార్ జిఏవిఎల్ దేవి, డిఎల్ఎస్ఏ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు, సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎంపీడీవో, రెవిన్యూ, ఐసిడిఎస్, విద్యాశాఖ అధికారులు, వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.