విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా, బాదంపూడి లో గల దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం బాదంపూడి నందు 135వ బృందములో శిక్షణ పొందుటకు అభ్యర్ధులు 19 ఫిబ్రవరి, 2025 వ తేదీలోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాకు పంపాల్సిందిగా ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి.నాగలింగచార్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు..
5వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ప్రాదాన్యత, తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి అవకాశం ఇవ్వబడును. 18 సంవత్సరములు నుండి 30 సంవత్సరములు మధ్య వయస్సు గల వారు అర్హులు.. అర్హతలు సై ఎంపిక కమిటీ ప్రత్యేక పరిగణనలో వయస్సు పరిమితిని సడలించవచ్చును. సహాయ పరిశీలకులు మత్స్యశాఖ హోదాకు తగ్గకుండా మత్స్యశాఖ అధికార్ల నుండి పొందిన అనుభవము సర్టిఫికెట్లు దరఖాస్తుతో జతపరిచి పంపవలసిందిగా కోరుచున్నారు.
ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలోని వారికి, మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘముల సభ్యులు చేపల పెంపకము నందు ఆసక్తి కలిగిన ఇతరులు, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులుగా పేర్కొన్నారు.. ఉపకార వేతనము లేకుండా, ఇందులో చేరడానికి 20 సీట్లు అందుబాటులో కలవు.. 20.02.2025 ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలను, మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయములో జరుగును. ఇంటర్వ్యూలో ఎంపిక అయిన వారి పేర్లు అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు కార్యాలయం నోటీసు బోర్డు లో ఉంచుతారన్నారు.
ఎంపిక అయిన అభ్యర్థులకు 01.03.2025 నుండి 31.05.2025 వరకు నిర్వహించబడును.. శిక్షణా కాలంలో మత్స్య క్షేత్రములు మరియు రిజర్వాయర్లలో చేపలు పెంపకము గురించి భోదన మరియు ప్రాక్టికల్ తో కూడిన కోర్సు భోదించబడును. శిక్షణాంతరము పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వబడును.
అభ్యర్ధి బయోడేటాలను స్వదస్తూరీ గాని, టైప్ చేసి గాని ధరకాస్తులు 19.02.2025 వ తేదీ లోగా ఈ కార్యాలయమునకు చేరవలయును. సదరు ధరఖాస్తు ఫారము సంబంధిత జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు లేదా మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయములో లబించును. ఇంటర్వ్యూకు హాజరుయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు విధిగా తీసుకురావలెను. ఇతర వివరములకు మత్స్య శాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి (సెల్ నెం. 9573337484) మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 1 (సెల్ నెం. 7286993033), మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 2 (సెల్ నెం. 9492337469) వారిని కార్యాలయము పనివేళ్లల్లో సంప్రదించాల్సిందిగా ఆ ప్రకటనలో ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి.నాగలింగచార్యులు ఆ ప్రకటనలో తెలియజేశారు.