Breaking News

అనధికార డంపింగ్‌ ప్రాంతాలపై పూర్తి పర్యవేక్షణ పెట్టండి…

-అనుమతి లేకుండా వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోండి…
-ప్రజల ఆరోగ్యమే ముఖ్యం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి…
-గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ లను తక్షణమే తొలగించండి…
-జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ ప్రదేశాలు మరియు రోడ్ల వెంట వ్యర్ధ పద్దార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ను తక్షణమే తొలగించి ఆయా ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేసి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలను విధించేందుకు వెనకాడవద్దని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ ఆంధ్ర ` స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం జగ్గయ్యపేట మున్సిపల్‌ పరిధిలో డంపింగ్‌ యార్డ్‌ను జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ, స్థానిక శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ (తాతాయ్య)తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర ` స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి ప్రభుత్వం ఆధిక ప్రాధ్యానత ఇస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్ల వెంబడి అనధికరంగా వ్యర్థ పద్ధార్థాలను విడిచి వేయడం వలన వీపరితమైన దుర్గందంతో పాటు అంటు రోగాలు ఏర్పాడుతున్నాయన్నారు. జగ్గయ్యపేట పట్టణ పరిధిలో విలియం పేట సమీపంలో వ్యర్థాలను విడిచిన డంపింగ్‌ యార్డ్‌ వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తక్షణమే ప్రసుత డంపింగ్‌ యార్డ్‌ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి తరలించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. డంపింగ్‌ యార్డ్‌ తొలగింపు ప్రక్రియను సాద్యమైనంత త్వరలో పూర్తి చేసి ప్రస్తుతం డంపింగ్‌ యార్డ్‌ ప్రదేశాన్ని శుభ్రపరిచి మొక్కలను నాటి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ మున్సిపల్‌ అధికారులు గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ (జివిపి)పై ప్రత్యేక దృష్టి పెట్టి వారం రోజులలోపు వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలగించిన ప్రదేశాల వద్ద సిసికెమెరాలు పంచాయతీ సిబ్బందితో నిఘా ఉంచి ఎవరైతే అనాధికరంగా వ్యర్థాలను విడిచిపెడుతున్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్థేశించిన ప్రాంతాలలో మాత్రమే వ్యర్థ పద్ధార్థాలను విడిచిపెట్టాలని హోటల్‌ యాజమానులకు, వ్యాపారస్తులకు తక్షణమే నోటీసులను అందజేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంట వ్యర్థ పద్దార్థాల గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ గుర్తించి వాటిని తొలిగింపుకు గ్రామ పంచాయతీ మున్సిపల్‌ మండల అభివృద్ధి అధికారులు తహాశీల్థార్లు చర్యలు తీసుకోవాలన్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి చెత్తనుండి సంపద తయారి కేంద్రాలకు తరలించాలన్నారు. జిల్లాలో చెత్త నుండి సంపద తయారి కేంద్రాల ద్వారా వర్మి కంపోస్ట తయారీ అవుతుందని వర్మి కంపోస్టులకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ తాతాయ్య మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ద్వారా జగ్గయ్యపేట పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చైర్మన్‌ జగ్గయ్యపేటను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఆధునీకరించేందుకు ప్రతి పాధించడం జరిగిందన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో జగ్గయ్యపేటను ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తానని శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆర్‌. రఘవేంద్రరావు, మున్సిపల్‌ కమీషనర్‌ రాంమోహన్‌, 14వ వార్డు కౌన్సిలర్‌ నకిరకంటి వెంకట్‌, 9వ వార్డు కౌన్సిలర్‌ పి. సైదేశ్వరరావు, జగ్గయ్యపేట తహాశీల్థార్‌ మనోహర్‌, మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *