Breaking News

ప్రధానమంత్రి సూర్యఘర్ :ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రధాన మంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పధకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రధమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.ఈ పథకాన్నిజాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (NPIA) మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (SIAలు)అమలు చేస్తాయని తెలిపారు.కావున ఈ పథకం కింద డిస్కమ్‌లు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.ఈ పియం సూర్యఘర్ పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్దఎత్తున ఈపధకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు గ్రామం,తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నూరు శాతం సోలరైజేషన్ కు ప్రభుత్వం ప్రతిపాదించిందని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 5 గ్రామాలను ఈవిధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా ఫైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సిఎస్ తెలిపారు.
పియం సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన కింద 2కిలో వాట్ సామర్థ్యం గల సిస్టమ్‌లకు సోలార్ యూనిట్ ధరలో 60% మరియు 2 నుండి 3కిలో వాట్ సామర్థ్యం మధ్య సిస్టమ్‌లకు అదనపు సిస్టమ్ ఖర్చులో 40% సబ్సిడీని,3కిలో వాట్ వరకూ 78 వేల రూ.ల వరకూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.దరఖాస్తుదారు సోలార్ ప్యానెళ్లను అమర్చుకో డానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలి.గృహాల తోపాటు వివిధ ప్రభుత్వ భవనాలు,పాఠశాలలు,కళాశాలలు తదితర ప్రభుత్వ భవనాలపైన సోలార్ రూప్ టాప్ లు ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లుల పొదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కావున సంబంధిత శాఖల సమన్వయంతో తగిన కార్యాచరణ ప్రణాళికలను సిధ్ధం చేయాలని సిఎస్ విజయానంద్ ట్రాన్సుకో అధికారులను ఆదేశించారు.
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్(పియం-కుసుమ్) పధకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కృషి జరుగు తోందని సిఎస్ విజయానంద్ తెలిపారు.రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల 17వేల వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో లక్ష పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లుకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో 2లక్షల సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన చెప్పారు.సోలార్ రూప్ టాప్ ఇన్స్టాలేషన్ల ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులు,హెచ్ఓడిలతో రాష్ట్ర స్థాయి కోఆర్డినేష్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాగా ఈకమిటీ ప్రతి మూడు మాసాలకు ఒకసారి సమావేశమై చర్చించడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
అంతకు ముందు ఎపి జెన్కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పియం సూర్యఘర్,పియం కుసుమ్ పధకాల అమలుకు సంబంధించిన వివిధ మార్గదర్శకాలను వివరించారు.ఇంకా ఈసమావేశంలో ఎపి ట్రాన్సుకో జెఎండి కీర్తి చెరుకూరి, ఎపి ఇపిడిసిఎల్,ఎపి ఎస్పిడిసిఎల్,ఎపి సిపిడిసిఎల్ సిఎండిలు పృధ్వీ తేజ్,సంతోషరావు,ఎకెవి భాస్కర్,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు,సంయుక్త కార్యదర్సి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,సెర్ప్ సిఇఓ వి.కరుణ,హౌసింగ్ ఎండి రాజబాబు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *