Breaking News

పోలీసు పెరేడ్ నందు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

-జిల్లా సంయుక్త కలెక్టర్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుపుతూ, వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. శనివారం సాయంత్రం జెసి పేరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ 76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వేడుకలను పండగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని

సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు మరియు జెండా పతాక ఆవిష్కరణకు అందరు హాజరు కావాలని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించే శకటాలు, వివిధ శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాట్లు, విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు స్టేజి డెకరేషన్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర పనులు సక్రమంగా ఉండాలని సూచించారు. ఇందులో 8 సాంస్కృతిక కార్యక్రమాలు,11 శకటాలు, 11 వివిధ శాఖల ఎగ్జిబిషన్ స్టాల్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్డిఓ రామ్మోహన్, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, డి ఆర్ డి ఎ – వెలుగు పిడి శోభన్ బాబు, డిఈఓ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *