Breaking News

చంద్రగిరి కోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ పర్యాటక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం చంద్రగిరి కోటలో జాతీయ పర్యాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏ.పి టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ మూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక చంద్రగిరిలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు మరియు శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు కలిసి ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఎంతో చారిత్రాత్మక ఘనత కలిగిన చంద్రగిరి కోట నందు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ డా. రమణ మూర్తి మాట్లాడుతూ.. చారిత్రాత్మక కట్టడమైన చంద్రగిరి కోట యొక్క చరిత్రను మరియు స్థానికంగా ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను గూర్చి విద్యార్థులకు తెలియజేసి వాటి గూర్చి వివిధ రకాల పోటీలను (చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ ) నిర్వహించారు. అలాగే పర్యాటక ప్రదేశాల గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్ ,ట్విట్టర్, ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ మొదలగు వాటిని ఉపయోగించి విస్తృత ప్రచారం చేపట్టాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు తెలియపరిచారు.

చంద్రగిరి మండల ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన విహార యాత్రలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదమును అందిస్తాయని ,మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే శారీరక ఎదుగుదలతో పాటు విద్యా నైపుణ్య అభివృద్ధి కూడా పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఆలోచనలను,సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని, తమ నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి, దేశానికి గొప్ప కీర్తిని అందించాలని సూచించారు. మన చుట్టూ ఉన్న సమాజంలోని గొప్ప వారి స్ఫూర్తితో వారి ఆశయ సాధనలో భాగంగా తమ అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పాటు
అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విద్యాశాఖ అధికారిని ఎస్.లలిత కుమారి, బాల బాలికల పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్ఎంటిలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *