విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, డా . బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శనివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని పోలీసు పరేడ్ మైదానంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …