Breaking News

శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ ఉచిత మెగా మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్, వేద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్.వై.శేష సాయి ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారాయణపురం శివాలయం దగ్గర శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవాడ సెంట్రల్ ఎం ఎల్ ఎల్ బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈరోజు పేద ప్రజల కోసం వేదా హాస్పటల్ వారు ఆర్థోపెడియన్ వెన్ను సంబంధిత, దంత పరీక్షలు మరియు ఆయుర్వేద వైద్యం తో పాటు చిన్న పిల్లల వైద్య నిపుణుల తో పరీక్షలు అన్నీ నిర్వహించి ఉచితంగా మందులు అందించడం చాలా సంతోషమన్నారు. ముఖ్యఅతిథిగా నందివెలుగు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ తోట లక్ష్మికోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన కీళ్ల, ఎముకల వైద్య నిపుణులు, వెన్ను సంబంధిత వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొన్నారని నిర్వాహకులు వేద హాస్పిటల్ చైర్మన్ డా.శేష సాయి తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ శేష సాయి మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ప్రజా సేవలో అనేక సేవా కార్యక్రమాలు,వైద్య శిబిరాలు ఉచిత మందుల పంపిణీలు చేసామని, షుగర్, బిపి, ఈ.సీ.జీ, బిఎండి( వైబ్రో చెక్) టెస్టులు ఉచితంగా చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం జరిగిందని, ఇంకా మెరుగైన టెస్టులు అవసరమైన వారికి ఇతర టెస్టులు కూడా ఉచితంగా చేస్తామని, ఐదు వందల మంది ప్రజలు ఈ శిబిరంలో వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా కి, 33 డివిజన్ టిడిపి ఇంచార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
టిడిపి బ్రాహ్మణ సాధికారిక రాష్ట్ర సభ్యులు, 33 డివిజన్ టిడిపి ఇంచార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు సత్యనారాయణపురంలోని 33వ డివిజన్లో ప్రజలకి నిష్ణాతులైన వైద్యులచే వివిధ రకాల జబ్బులు కి ఉచితంగా టెస్టులు చేయడం మందులు అందించడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్ పర్సన్ యడ్లపాటి శిరీష రాణి, వేద హాస్పిటల్ చైర్మన్ డా: వై శేష సాయి కి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డా. బి.వి గురునాథ శర్మ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ జె.ఆర్.ఎస్. గౌతమ్, వెన్నుముక సంబంధిత వ్యాధి వైద్య నిపుణులు, డా. ఎన్. చైతన్య కృష్ణ జనరల్ మెడిసిన్, డా. బి మేఘన చిన్నపిల్లలు మరియు నవజాత శిశువుల వైద్య నిపుణులు, డా. విట్టం శెట్టి శశాంక్ డయాబెటాలజీ & మెటబాలిక్ డిజార్డర్స్, డా. ఆర్. పవన్ కుమార్ ముక్కు గొంతు వైద్య నిపుణులు, డా. కూరపాటి అశోక్ వర్ధన్ ప్రోస్టోడెంటిస్ట్, డా, సింధు బొమ్మిడి పంచకర్మ స్పెషలిస్ట్,డా, పి జగదీష్ దీర్ఘకాలిక వైద్య నిపుణులు, వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్ పర్సన్ యడ్లపాటి శిరీష రాణి, వేద హాస్పిటల్స్ చైర్మన్ డా:శేష సాయి, హాస్పటల్ సిబ్బంది ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *