Breaking News

అధికారంలోకి 7 నెలల్లోనే 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిది

-ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతం రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
-నారా లోకేష్ యువగళం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వానికి ఘన విజయం
-యువగళం పాదయాత్రలో ప్రజలు తెలియజేసిన ప్రతీ సమస్యకు పరిష్కారంకల్పిస్తున్న మంత్రి నారా లోకేష్

నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 7 నెలల్లోనే రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చి , 40 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తూ,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘బ్రాండ్ ఏ పి ‘ గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడులో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైందని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లినా అక్కడ వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు మంత్రి నారా లోకేష్, భరత్, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడులు దావోస్ పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, 21 ఇండస్ట్రియల్ పాలసీల గురించి తెలియజేయడంపై అక్కడి పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనపరిచి, పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. . 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి 11. 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధిస్తే, గత ప్రభుత్వం ఆయా పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేసి, రాష్ట్రం నుండి వెళ్లిపోయేలా చేసి పారిశ్రామికాభివృద్ధిని కుదేలు చేశారన్నారు. నూజివీడు దగ్గరలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ వంటి ఎన్నో సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని, గత ప్రభుత్వం ఆయా పారిశ్రామికవేత్తలను భయపెట్టి పంపించివేశారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయంలో మన రాష్ట్రాన్ని గొప్పగా నిలిపేలా సీఎం కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2. 8 లక్షల రూపాయల తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 58 లక్షల రూపాయలకు తీసుకువెళ్లేలా ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ ద్వారా ప్రణాళికలను పరిశీలించిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ మెచ్చుకుని, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారన్నారు. ఆ రంగమైతే రాష్ట్ర జి డి పి పెరిగేందుకు ప్రభావితమవుతుందో వాటిపై శ్రద్ద తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం వీటన్నింటినీ విస్మరించి రాష్ట్రాభివృద్ధి మరిచిందన్నారు. టాటా కన్సల్టెన్సీ 10 వేల మంది యువతకు సాఫ్ట్ వెర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమ నెలకొల్పబోతుందన్నారు. 85 వేల కోట్ల రూపాయలతో బిపి సిఎల్ రిఫైనరీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నదన్నారు. రిలయన్స్ 2 లక్షల కోట్ల రూపాయలతో 500 కంపోస్ట్ బయో గ్యాస్ యూనిట్లను ఏర్పాటుచేస్తున్నదన్నారు. ఆదిత్య మిట్టల్ 60 వేల కోట్ల రూపాయలతో యూనిట్ ని , ఎన్ టి. పి సి., సంస్థ 1. 87 లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటుచేయనున్న పరిశ్రమతో 1. 60 లక్షల మంది యువత కు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు., శ్రీసిటీ 2 వేల కోట్ల రూపాయలతో 11 యూనిట్లను ఏర్పాటుచేస్తుందని, దీనిద్వారా 6700 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మిట్టల్ సంస్థ ఒరిస్సాలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ ఓకే వీడియో కాల్ తో మిట్టల్ స్టీల్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారన్నారు. విశాఖ స్టీల్ ను కూడా ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు.

మంత్రి నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన భరోసాతో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం: యువగళం పాదయాత్రకు 2 ఏళ్ళు పూర్తి: మంత్రి పార్థసారథి.

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి నేటికీ 2 సంవత్సరాలు పూర్తి అయిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 226 రోజులపాటూ 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలలో నారా లోకేష్ పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారని, లోకేష్ ప్రజలలో కల్పించిన భరోసా కారణంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ విజయం అందించారన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కారణంగా రాయలసీమలో మెజారిటీ నియోజకవర్గాలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చినవెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. నూజివీడు ప్రాంతంలో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి గాను నూజివీడులో 30 కోట్ల రూపాయలతో మామిడి పంట అభివృద్ధికిగాను మార్కెటింగ్ యార్డ్ అభివృద్ధి చేశామన్నారు. పవన్ కళ్యాణ్ 13 వేల గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల కోరిక మేరకు 4 వేల కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మిస్తున్నారన్నారు. సింగనమల రైతు సదస్సులో రైతుల సమస్యలు తెలుసుకుని రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జిల్లా రైతుల హక్కులను కాపాడుతూ గోదావరి మిగులు జలాలలను రాయలసీమకు అందించేందుకు 80 వేల కోట్ల రూపాయలతో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారని, దీనితో రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా రూపొందుతుందన్నారు. యువగళం లో ప్రజల సమస్యలతో సూపర్ – 6 వంటి పథకాలకు ప్రభుత్వ ఆలోచనా విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిరోధించడానికి, నేరాల అదుపునకు , ప్రజల భద్రతకు లక్ష సిసి కెమెరాలతో పోలీసు వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కూరగాయల వాహనాలకు అనుమతి ఇవ్వండి

-సుజనా చౌదరికి హోల్ సేల్ కూరగాయల వ్యాపారుల వినతి.. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజీవ్ గాంధీ హోల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *