-ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 16 మందికి రూ. 6. 55 లక్షల ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యను ఇస్తున్నదని , ప్రతీ పేదవాడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులో క్యాంపు కార్యాలయంలో సోమవారం 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 6. 55 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతీ పేదవాడికి తమ ప్రభుత్వం అండగా ఉంది ఆదుకుంటుందన్నారు. ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా వైద్య చికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు సంబంధిత వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తున్నామన్నారు. నూజివీడు మండలంలో 8 మంది కి 4 లక్షల రూపాయలు, చాట్రాయి మండలంలో 6 గురికి 2. 16 లక్షలు, ఆగిరిపల్లిలో ఇద్దరికీ 57 వేల రూపాయలు చొప్పున అందించడం జరిగిందన్నారు.
స్థానిక ప్రముఖులు అక్కినేని చందు,ముసునూరు రాజాబాబు, కాపా శ్రీనివాసరావు, పల్లి నాగరాజు, గొల్లి లక్ష్మీదేవి, శివలక్ష్మి, నాగమణి, పాశం నాగబాబు, ప్రభృతులు, పాల్గొన్నారు.