మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) గోడౌన్ కు పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ లోని ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గోదాముకు సీసీ టీవీ కెమెరాలతో చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందన్నారు. తనిఖీలో ఎలక్షన్ డిటి యం.వి.శ్యామ్ నాథ్, కోఆర్డినేషన్ సెక్షన్ డిటి వై. లక్ష్మీనారాయణ ఉన్నారు.
![](https://prajavartha.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-5.46.20-PM-390x330.jpeg)