అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో …
Read More »Daily Archives: February 8, 2025
ప్రధానిపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీకి పట్టం
-ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదు -సంక్షేమం పేరుతో అవినీతి చేస్తున్నవారిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. -సమర్థ, సుస్థిర, విజనరీ పాలనతోనే ప్రజల జీవితాల్లో మార్పులు -కంటిన్యుటీ ఆఫ్ గవర్నమెంట్‌తో తిరుగులేని విజయాలు…ఇది చరిత్ర చెపుతున్న వాస్తవం -ఒకే పార్టీ, ఒకే నేత వరుసగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు -2047 నాటికి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం మన ఏపీలోనే -విలువలు లేని వారు విలువల గురించి సబబు కాదు -ప్రజలిచ్చిన తీర్పును జగన్ గౌరవించడం లేదు…అహంకారంతో వ్యవహరిస్తున్నారు -ప్రజల సౌకర్యార్ధం …
Read More »కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలి
-సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు రాష్ట్ర సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటు …
Read More »చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పలమనేరులో రూ.15.18 కోట్ల తో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాలను మరియు జడ్జిల నివాస భవన సముదాయాన్ని ప్రారంభోత్సవం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్. పలమనేరు,ఫిబ్రవరి 08: చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు. శనివారం పలమనేరు బెంగళూరు …
Read More »శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సన్నద్ధతపై ఆరా తీసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన దేవస్థాన ఈవో -బ్రహ్మోత్సవాలకు సన్నద్ధతపై ఈ నెల 10 వ తేదీ మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలోని ఆర్ & బీ …
Read More »పి.బి. సిద్ధార్థ కళాశాలలో ఈ 12న సియన్షియా
-జంతు, వృక్ష , జీవసాంకేతికశాస్త్ర విభాగాల మెగా ఈవెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రవిజ్ఞానాన్ని యువతరంలో వ్యాప్తిచేయడానికి సీయన్షియా పేరుతో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలకు చెందిన వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవసాంకేతికశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ నెల 12న పి.బి.సిద్ధార్థ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, వృక్షశాస్త్రాధిపతి డాక్టర్ పువ్వాడ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కళాశాలలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల ఆవిష్కరించారు. సియన్షియా …
Read More »గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేపటినుండి మూడు రోజులపాటు విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరగనున్న గుణదల మేరీమాత ఉత్సవాలకు పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలపరంగా మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17 మంది డీఎస్పీలు, 44 మంది ఇన్స్పెక్టరలతో కలిపి సుమారు 1050 మంది సిబ్బందితో పటిష్టమైన పోలీస్ …
Read More »పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలన…
-పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్ల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన నగర్ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు గ్రామంలోని వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం- పెద్ద తిరునాళ్లు సందర్భంగా ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐపీఎస్ దంపతులు అన్వాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించి దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతరం ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు …
Read More »నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి…
-ఉద్యోగ ఖాళీల భర్తీ పదోన్నతల అంశం ప్రభుత్వానికి తీసుకు వస్తాం. -ఏపీ ఎన్జీజీఓ నేతలు కె.వి. శివారెడ్డి, ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఏపీ ఎన్జీజీఓ సంఘంలో నాలుగవ తరగతి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని సంఘానికి నాలుగో స్తంభం మైన నాల్గోతరగతి ఉద్యగుల సంక్షేమం ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తామని ఎన్జీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాల్గవ తరగతి …
Read More »విద్యార్థి బంగారు భవితకు ప్రాథమిక విద్యే పునాది..
– పాఠశాల విద్యలో 1, 2 తరగతులు చాలా కీలకమైనవి – ప్రశ్నించి తెలుసుకునే ఆహ్లాదకర వాతావరణాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి – ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యలో 1, 2 తరగతులు చాలా కీలకమైనవని.. విద్యార్థి బంగారు భవితకు ప్రాథమిక విద్యే పునాదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు.. చిన్నారులకు సమగ్ర నైపుణ్యాలను అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం …
Read More »