-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండునెలల్లో ముగియనుందని, ఆలోగా బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో అందజేస్తున్న స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి, యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. శనివారం తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ లో జిల్లా బీసీ కార్పొరేషన్, చేనేత, జౌళిశాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీలను ఆర్థికంగా …
Read More »Daily Archives: February 8, 2025
బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లలో టెన్త్ లో వంద శాతం రిజల్ట్ రావాల్సిందే
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -తరుచూ హాస్టళ్లను సదర్శించండి -జిల్లా స్థాయిలో బీసీ సంక్షేమశాఖాధికారులకు మంత్రి ఆదేశం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో బీసీ హాస్టళ్లలో వంద శాతం మేర ఫలితాలు రావాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఇందుకోసం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ క్లాస్ …
Read More »మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…పుస్తక పఠనం ఒక మంచి అలవాటు
-ప్రతి ఒక్కరూ మంచి పుస్తక పఠనం వారి దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి -భారతీయ విద్యా భవన్ వారు ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన భేష్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం మంచి పుస్తక పఠనానికి కేటాయించి వారి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని యువతకు తిరుపతి జిల్లా కలెక్టర్ …
Read More »నగరంలో సందడిచేసిన డాన్స్ ఐకాన్ 2 టీం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయ్యిందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకుమించి అలరించబోతుందని చెప్పారు. శనివారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్ …
Read More »‘‘మెస్సీయ ఫెలోషిప్’’ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘మెస్సీయ ఫెలోషిప్’’ ఆధ్వర్యంలో దైవజనులు డాక్టర్ సజ్జా రత్నకుమార్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం విజయవాడ స్థానిక ఆటోనగర్ గేట్ వద్ద 100 అడుగుల రోడ్డులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు డాక్టర్ సజ్జ రత్నకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మధ్యాహ్నానికి సుమారు 1,800 మంది పైగా పేషెంట్లు వారి వారి వ్యాధులను, నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వ్యాధులను బట్టి ఉచిత టెస్టులు, డాక్టర్ సలహాలు. …
Read More »ఘనంగా మహిళా ఉత్సవ్-2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన శిక్షణ సంస్ధాన్, విజయవాడ వారు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించు మహిళా ఉత్సవాన్ని, ఈ సంవత్సరం 2024`25 శనివారం మొగల్ ఫంక్షన్ హాలు, మధు గార్డెన్ప్ నందు సంస్ధ చైర్మన్ డా. ఎన్.విద్యా కన్నా ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ సభను నిర్వహించగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ సభకు ముఖ్య అతిధి కె.సుహసిని దేవి , పి.డి, (రిటైర్డ్) డిపార్డ్‌మెంట్ ఆఫ్ వుమెన్ & చైల్డ్ వెల్‌ఫేర్ (ఉమ్మడి కృష్ణా …
Read More »అవినీతి పార్టీలకు చరమగీతం పాడారు
-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం సాధించడంపై విజయవాడలో కూటమి నేతలు సంబరాలు చేసారు.. శనివారం భవానిపురంలోని శివాలయం సెంటర్ చౌరస్తాలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. బిజెపి జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పెరిగిన …
Read More »వైభవంగా కొమ్మనబోయిన – పెరుగు వారి వివాహ మహోత్సవ వేడుక
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ పోలీసు అధికారి నరసరావుపేట డిఎస్పి కొమ్మనబోయిన నాగేశ్వరరావు – సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు చి. అభిలాష్ కుమార్….. పెరుగు భాస్కరరావు – జయలక్ష్మి దంపతుల కుమార్తె చి. ల. సౌ. ప్రవల్లిక ల వివాహం సోమవారం తెల్లవారుజామున నరసరావుపేట మెగా కన్వెన్షన్ హాలులో వైభవోపేతంగా జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పలు రంగాలు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read More »
Prajavartha Online Telugu News